Chandrababu: అసెంబ్లీ ముందు చంద్రబాబు ధర్నా... అలర్ట్ అయిన పోలీసులు!

షార్ట్స్‌లో చూడండి
నిన్న అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన ముగ్గురు తెలుగుదేశం సభ్యులు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను తిరిగి అసెంబ్లీలోకి పిలవాలని, వారిపై ఉన్న సస్పెన్షన్ వేటును వెనక్కు తీసుకోవాలని ఈ ఉదయం అసెంబ్లీ ప్రధాన గేటు ముందు చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.

అయితే, ఈ మార్గం సీఎంతో పాటు మంత్రులు ప్రయాణించే మార్గం కావడంతో పోలీసులు అప్రమత్తమై, భారీ ఎత్తున బలగాలను మోహరించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే సస్పెండ్ చేయడం తీవ్రమైన అన్యాయమని, తమ సభ్యులపై వేసిన వేటును వెనక్కు తీసుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. 
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
Assembly
Protest

More Telugu News