PVP: మన కింగ్ కాంగ్ కి ప్రబుద్ధుడు 10 వేల దొంగ ఓట్లు వేయించాడు: పీవీపీ

  • దొడ్డిదారిలో గెలిపించాడు 
  • సర్వీస్ చార్జెస్ ఇవ్వలేదు 
  • బ్రేకింగ్ న్యూస్ అంటూ పీవీపీ ట్వీట్ 
ఓ నియోజకవర్గంలో 10 వేల దొంగ ఓట్లు వేయించిన ఓ ప్రబుద్ధుడు మన కింగ్ కాంగ్ ను దొడ్డి దారిలో గెలిపించాడని విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన పీవీపీ (పొట్లూరి వరప్రసాద్) వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "బ్రేకింగ్ న్యూస్...! మన కింగ్ కాంగ్ కి ప్రబుద్ధుడు ఒక నియోజకవర్గంలో 10 వేల దొంగ ఓట్లు వేయించి, దొడ్డి దారిలో గెలిపించాడు. ఇప్పుడు old habits die hard! .ప్రబుద్దుడు సర్వీస్ చార్జెస్ కి పేమెంట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చాడు కింగ్ కాంగ్. అందుకే ఈ కొబ్బరి చిప్పలు, కాల్ మనీ గొడవలు" అని అన్నారు. కాగా, పీవీపీని భారీ మెజారిటీతో కేశినేని నాని ఓడించిన సంగతి తెలిసిందే. 
PVP
Twitter
Rigging
Vijayawada

More Telugu News