Telangana: ఇరు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

షార్ట్స్‌లో చూడండి
ఈరోజు తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇదే సమయంలో తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వారు వెల్లడించారు. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు, ఏపీలోని కోస్తా జిల్లాలతో పాటు పలు చోట్ల కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Go Back to Shorts
Telangana
Andhra Pradesh
Rain

More Telugu News