మోదీ శైలిని అనుకరిస్తున్న పాక్ ప్రధాని
- ఈ నెల 22న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో సమావేశం
- 21న పాక్ జాతీయులతో వాషింగ్టన్‌లో ర్యాలీ
- నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్న ఇమ్రాన్ వ్యతిరేక వర్గాలు
కాగా, అమెరికాతో పాటు అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించేందుకు సోమవారం అంతర్జాతీయ ఉగ్రవాది, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ను పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. అయితే, ట్రంప్‌తో సమావేశానికి ముందు సయీద్‌ను అరెస్ట్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, వాషింగ్టన్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ నిర్వహించనున్న ర్యాలీకి నిరసన సెగ తగిలేలా కనిపిస్తోంది. ఇమ్రాన్ ర్యాలీని అడ్డుకునేందుకు అసమ్మతి గ్రూపులు సిద్ధమవుతున్నాయి. ముహాజిర్లు, బలోచ్ గ్రూపులతోపాటు భుట్టో-జర్దారీ అనుకూల వర్గాలు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మద్దతుదారులు ఈ ర్యాలీలో నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు.