హేమమాలిని సినిమాల్లో మాత్రమే చీపురు పడుతుంది: ధర్మేంద్ర చురక
- చీపురు పట్టడంలో స్పెషలిస్టునని వెల్లడి
- శుభ్రతను చాలా ఇష్ట పడతానన్న ధర్మేంద్ర
- ధర్మేంద్రపై ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు
సినిమాల్లో మాత్రమే హేమమాలిని చీపురు పడుతుందని ధర్మేంద్ర నిజాయతీగా ఒప్పుకున్నారు. తాను మాత్రం చీపురు పట్టి శుభ్రం చేయడంలో నిపుణుడినని, శుభ్రతను చాలా ఇష్టపడతానని అన్నారు. ఇంత నిజాయతీగా సమాధానమిచ్చిన ధర్మేంద్రపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరోపక్క, ధర్మేంద్ర చెప్పిన సమాధానంపై హేమమాలిని ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తారోనంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.