England: విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ జట్టుపై కోట్ల వర్షం... ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

షార్ట్స్‌లో చూడండి
ఇంగ్లాండ్ లో నెలరోజులకు పైగా ఉర్రూతలూగించిన వరల్డ్ కప్ సమరం ముగిసింది. 10 జట్లు పాల్గొన్న ఈ వన్డే క్రికెట్ పోరాటంలో ఇంగ్లాండ్ జట్టు జగజ్జేతగా నిలిచింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ విజేతగా నిలవడం ఇదే ప్రథమం. 1979, 1987, 1992లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న ఇంగ్లాండ్ ఈసారి కప్ ఎగరేసుకెళ్లింది. కాగా, గతంతో పోలిస్తే ఈసారి ప్రపంచకప్ విజేతలకు భారీగా ప్రైజ్ మనీ పెంచారు. కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టుకు రూ.27.42 కోట్లు బహుమతిగా అందించారు. ఫైనల్లో ఓటమితో రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు రూ.14 కోట్లు దక్కాయి. ఇక, సెమీస్ లో ఓడిన భారత్, ఆసీస్ లకు చెరో రూ.5.6 కోట్లు ముట్టజెప్పారు.
Go Back to Shorts
England
New Zealand
World Cup

More Telugu News