ఎవరూ చేయని విధంగా 'బాటిల్ క్యాప్ చాలెంజ్' పూర్తిచేసిన యువరాజ్ సింగ్
- క్రికెట్ షాట్ తో బాటిల్ మూత గాల్లోకి లేపిన యువీ
- లారా, ధావన్, గేల్, సచిన్ లకు సవాల్
- వైరల్ అవుతున్న వీడియో
యువీ ఓ టెన్నిస్ బంతిని షాట్ ఆడగానే, ఆ బంతి ఎదురుగా ఉన్న మంచినీళ్ల సీసాకు తగలడం, ఆ సీసా మూత గాల్లోకి లేవడం వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా, ఓ లెఫ్ట్ హ్యాండర్ గా ఇతర లెఫ్ట్ హ్యాండర్లకు సవాల్ విసురుతున్నానంటూ బ్రియాన్ లారా, శిఖర్ ధావన్, క్రిస్ గేల్, సచిన్ టెండూల్కర్ లను యువరాజ్ ఈ చాలెంజ్ కు నామినేట్ చేశాడు. సచిన్ ఆటలో కుడిచేతివాటమే అయినా స్వతహాగా లెఫ్ట్ హ్యాండర్. ఈ ఉద్దేశంతోనే సచిన్ కూడా నామినేట్ చేశాడీ డాషింగ్ ఆల్ రౌండర్.