అమెరికాలో బీజేపీ అగ్రనేతతో చర్చలు జరిపిన పవన్ కల్యాణ్

  • తానా మహాసభలకు హాజరైన పవన్, రాంమాధవ్
  • ఏపీ రాజకీయాలపై చర్చించిన నేతలు
  • తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన భేటీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అంశం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు కీలక అంశాలపై చర్చించినట్టు సమాచారం. తానా మహాసభలకు పవన్, రాంమాధవ్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై పవన్, రాంమాధవ్ లోతుగా చర్చలు జరిపారు. వీరి భేటీపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 
Go Back to Shorts
Pawan Kalyan
RaM Madhav
Janasena
BJP
TANA
Washington DC

More Telugu News