మహారాష్ట్రలో అమానుషం.. ప్రభుత్వ ఇంజనీర్ పై బురద పోసి, బ్రిడ్జీకి కట్టేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే!
- మహారాష్ట్రలోని కంకవళ్లిలో ఘటన
- రోడ్డు గుంతలను పూడ్చకపోవడంపై ఆగ్రహం
- ఇంకా స్పందించని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్
కంకవళ్లి ప్రాంతంలో ముంబై-గోవా జాతీయ రహదారిపై గుంతలను పరిశీలించేందుకు హైవే ఇంజనీర్ ప్రకాశ్ షెడేకర్ ఈరోజు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాణే, ఆయన అనుచరులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఇంజనీర్ ప్రకాశ్ తో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఇంజనీర్ పై చిక్కటి బురద పోసి, తాళ్లతో పక్కనే ఉన్న బ్రిడ్జికి కట్టేసి అవమానించారు. కాగా, ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఇంతవరకూ స్పందించలేదు.