టీడీపీ హయాంలో విద్యుత్ కొనుగోళ్లపై సమీక్షకు కమిటీని ఏర్పాటు చేసిన సీఎం జగన్!
- 9 మంది సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
- కమిటీలో సభ్యులుగా బుగ్గన, బాలినేని, అజయ్ కల్లం
- సౌర, పవన విద్యుత్ ధరలను సమీక్షించనున్న కమిటీ
ఈ కమిటీకి ట్రాన్స్ కో సీఎండీ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. అలాగే ఈ కమిటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఏపీ అడ్వొకేట్ జనరల్, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం, ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ టీడీపీ ప్రభుత్వ హయాంలో అధిక ధరలకు కొనుగోలు చేసిన సౌర, పవన విద్యుత్ ధరలను సమీక్షించనుంది. అదే సమయంలో డిస్కంలకు తక్కువ ధరకు విద్యుత్ ను అమ్మేవారితో చర్చలు జరపనుంది.