చిరూ, కొరటాల సినిమా కోసం భారీ సెట్టింగ్స్
- చిరూతో కొరటాల మూవీ
- ఆగస్టు 22న లాంచ్ చేసే ఛాన్స్
- ఒక కథానాయికగా నయనతార?
ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారుల్లో ప్రత్యేకంగా భారీ సెట్స్ ను వేస్తున్నారట. చాలా వరకూ ఈ సెట్టింగ్స్ లోనే షూటింగు జరుగుతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నారు. అందువలన ఇద్దరు కథానాయికల అవసరం వుంది. ఒక కథానాయిక పాత్ర కాస్త డీసెంట్ గా వుండే పాత్ర కావడంతో, నయనతారనే అనుకుంటున్నారట. మరో కథానాయిక కోసం కొంతమంది పేర్లను పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఆ ఛాన్స్ ఏ కథానాయికకు దక్కుతుందో చూడాలి.