టాస్ ఓడినా శ్రీలంక కోరుకున్నదే దక్కింది!
- వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా
- శ్రీలంకకు బ్యాటింగ్ అప్పగింత
- మొదట బ్యాటింగ్ దక్కడంతో సంతోషం వ్యక్తం చేసిన లంక సారథి
టాస్ అనంతరం టీవీ వ్యాఖ్యాతతో మాట్లాడుతూ, తాము మొదట బ్యాటింగ్ చేయాలనే కోరుకున్నామని, టాస్ ఓడినా తమకు బ్యాటింగే దక్కిందని సంతోషం వ్యక్తం చేశాడు. మరోవైపు, సఫారీ కెప్టెన్ డుప్లెసిస్ పిచ్ సరికొత్తగా, తాజాగా కనిపిస్తోందని, తమ పేసర్లు పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నట్టు తెలిపాడు. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ లో పరువు కోసం ఆడుతోంది. మరోవైపు శ్రీలంక జట్టు ఇంగ్లాండ్ పై సంచలన విజయంతో సెమీస్ స్థానంపై ఆశలు పెంచుకుంది. అందుకే ఈ మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతోంది.