వీధి రౌడీలా మారిన బీజేపీ ఎమ్మెల్యే.. ఆక్రమణలు తొలగిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై బ్యాటుతో దాడి!
- మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఘటన
- ఆక్రమణలు తొలగిస్తున్న మున్సిపల్ ఉద్యోగులు
- ఇంకోసారి కూడా కొడతానన్న ఆకాశ్ విజయవర్గీయ
అన్నట్లు ఈ అకాశ్ విజయవర్గీయ బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయవర్గీయ సుపుత్రుడు కావడం గమనార్హం. కాగా, ఈ దారుణ ఘటనను మౌన ప్రేక్షకులుగా చూసిన పోలీసులు.. చివరికి ప్రభుత్వ ఉద్యోగులను బీజేపీ శ్రేణుల చెర నుంచి కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, కావాలంటే మరోసారి కూడా ప్రభుత్వ ఉద్యోగులను కొడతానని అకాశ్ విజయవర్గీయ సెలవివ్వడం గమనార్హం.