ఆప్ ఎమ్మెల్యేకు జైలు శిక్షను విధించిన ఢిల్లీ కోర్టు
- పోలింగ్ ప్రక్రియకు విఘాతం కల్పించారంటూ కేసు
- మూడు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు
- రూ. 10 వేల బాండ్ పై బెయిల్ మంజూరు
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందిని అడ్డుకున్నారనే అభియోగాలతో మనోజ్ కుమార్ పై ఐపీసీ సెక్షన్ 189 కింద కేసు నమోదైంది. దీనికి తోడు... పోలింగ్ స్టేషన్ వద్ద అలజడి సృష్టించారనే ఆరోపణలతో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 131 కింద కూడా అభియోగాలు నమోదయ్యాయి.