sekhar kammula: శేఖర్ కమ్ముల ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడట

షార్ట్స్‌లో చూడండి
శేఖర్ కమ్ముల సిద్ధం చేసుకునే కథలు మనసుకు దగ్గరగా ఉంటాయి .. సహజత్వానికి నిదర్శనంగా నిలుస్తాయి. అందువల్లనే స్టార్స్ లేకపోయినా ఆయన సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటాయి. అలా 'ఫిదా' సినిమాతో యూత్ హృదయాలను మరోమారు దోచేసిన ఆయన, ఆ తరువాత కొత్తవాళ్లతో ఒక సినిమాను మొదలెట్టేశాడు.

50 శాతం చిత్రీకరణ పూర్తయిన తరువాత, హఠాత్తుగా ఆయన చైతూ - సాయిపల్లవిలతో తన కొత్త సినిమాను ప్రకటించాడు. దాంతో ప్రస్తుతం తాను చేస్తోన్న సినిమా పూర్తయిన తరువాత, చైతూ సినిమాను మొదలెడతాడని అంతా అనుకున్నారు. కానీ కొత్తవాళ్లతో మొదలుపెట్టిన సినిమాను శేఖర్ కమ్ముల ఆపేశాడనేది తాజా సమాచారం. ఆ సినిమా అవుట్ పుట్ పట్ల సంతృప్తి చెందని శేఖర్ కమ్ముల, ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడని చెబుతున్నారు. శేఖర్ కమ్ముల ఇంతటి నిర్ణయం తీసుకోవడం నిజంగా ఆశ్చర్యమే. 
Go Back to Shorts
sekhar kammula

More Telugu News