అలా బాదేస్తానని అనుకోలేదు: ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్
- ఆఫ్ఘన్ తో మ్యాచ్ లో విరుచుకుపడ్డ మోర్గాన్
- 17 సిక్సర్లతో రికార్డు మోత
- అన్ని సిక్సర్లు కొట్టడమంటే మాటలు కాదన్న మోర్గాన్
ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. ఇంగ్లండ్ చేసిన 397 పరుగులు ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు కాగా, వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా మోర్గాన్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో మోర్గాన్ 71 బంతుల్లో 4 ఫోర్లు, 17 సిక్సర్లతో ఏకంగా 148 పరుగులు చేశాడు. ఆప్ఘన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ 9 ఓవర్లు వేసి వికెట్ తీయకుండా 110 పరుగులు ఇచ్చాడు. ప్రపంచకప్‌లో ఇది అత్యంత చెత్త రికార్డు.