maruthi: మారుతి ఆ నిర్ణయానికి వచ్చేశాడట!

షార్ట్స్‌లో చూడండి
తెలుగులో యూత్ కి నచ్చే సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడిగా మారుతి కనిపిస్తాడు. ఆ తరువాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేపథ్యంలో సాగే కథలను ఎంచుకుని ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించగలిగాడు. 'భలే భలే మగాడివోయ్' .. 'మహానుభావుడు' సినిమాలు ఆయనకి భారీ విజయాలను అందించాయి.

ఆ తరువాత మారుతి ఇతర సినిమాలకి కథలను అందిస్తూ వచ్చాడు. కొన్ని సినిమాలకి సమర్పకుడిగాను వ్యవహరించాడు. అయితే ఆ సినిమాలేవీ అంతగా ఆడలేదు. ఆయన ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టడం వలన 'శైలజా రెడ్డి అల్లుడు' ఆశించిన ఫలితాన్ని అందించకుండానే పోయింది. అందువల్లనే ఇక ఇతర వ్యవహారాలు పక్కన పెట్టేసి, దర్శకత్వంపై మాత్రమే దృష్టిపెట్టాలనే నిర్ణయానికి ఆయన వచ్చాడని చెప్పుకుంటున్నారు.
Go Back to Shorts
maruthi

More Telugu News