ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు!
- కోస్తాంధ్రకు దగ్గరగా ఉపరితల ఆవర్తనం
- ఉరుములతో భారీ వర్షాలకు చాన్స్
- వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు
పగటి ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ, రాత్రి వేళల్లో మాత్రం సాధారణ స్థాయితో పోలిస్తే, 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, మరో రెండు వారాలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అన్నారు. ఏపీ, టీఎస్ లోకి ఇంకా నైరుతీ రుతుపవనాలు ప్రవేశించలేదని, మరో 3 రోజుల్లో రుతుపవనాలు రావచ్చని అంచనా వేశారు. తొలుత ఏపీకి, ఆపై తెలంగాణలోకి రుతుపవనాలు వస్తాయని, అందుకు ఐదారు రోజులు పట్టవచ్చని వెల్లడించారు.