ఏకంగా ధనుశ్ సినిమాకే దర్శకుడిగా ఛాన్స్?
- 'అ' సినిమాతో ప్రశాంత్ వర్మకి ప్రశంసలు
- ఈ నెల 28న రానున్న 'కల్కి'
- ద్విభాషా చిత్రానికి సన్నాహాలు
ఈ నేపథ్యంలో తమిళ హీరో ధనుశ్ సినిమా చేసే ఛాన్స్ ప్రశాంత్ వర్మకి లభించినట్టుగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇటీవలే ధనుశ్ ను కలిసి ప్రశాంత్ వర్మ ఒక కథ చెప్పడం .. పూర్తి స్క్రిప్టును సిద్ధం చేయమని ధనుశ్ చెప్పడం జరిగిపోయాయట. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను నిర్మించనున్నారని అంటున్నారు. ఈ సినిమాలో ధనుశ్ పాత్ర చాలా డిఫరెంట్ గా వుంటుందట. అందువల్లనే వెంటనే ఆయన ఓకే అనేశాడని చెబుతున్నారు.