సీఎం జగన్ కు అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం!: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
- ఏపీ అభివృద్ధికి అన్నిరకాలుగా సహకరిస్తాం
- సులభతర వాణిజ్యానికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోంది
- గోయల్ వ్యాఖ్యలను స్వాగతించిన ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి
ఈరోజు తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు. కాగా, ఏపీకి సాయం చేస్తామన్న పీయూష్ గోయల్ వ్యాఖ్యలను ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్వాగతించారు. కేంద్రం సహకారం అందిస్తామని ముందుకు రావడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. జిల్లాల వారీగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్రో కెమికల్ కారిడార్లను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.