బొబ్బిలి కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్.. ఇద్దరు దుర్మరణం, 10 మందికి తీవ్రగాయాలు!
- విజయనగరం జిల్లాలోని బొబ్బిలిలో ఘటన
- ఒక్కసారిగా పేలిపోయిన బాయిలర్
- ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు
ఈ దుర్ఘటనలో బొబ్బిలి మండలానికి చెందిన జగదీశ్, బాడంగి మండలానికి చెందిన సురేష్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. మరో 10 మందికి తీవ్రగాయాలు కాగా, వీరిని తోటి కార్మికులు హుటాహుటిన బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసిన బొబ్బిలి పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.