Tamil Nadu: మరదలిపై ఏళ్ల తరబడి అత్యాచారం.. అబార్షన్ కి ప్రయత్నించడంతో దొరికిపోయిన వైనం!

షార్ట్స్‌లో చూడండి
ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు భార్య చెల్లిలిపై కన్నేశాడు. సంవత్సరాలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. చివరికి ఆమె గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కరుత్తన్‌గోడు సమీపంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. అయ్యప్పన్ (30) బిల్డింగ్ కాంట్రాక్టర్. ఐదేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లులున్నారు.

అయితే, పదో తరగతి చదువుతున్న భార్య చెల్లెలిపై కన్నేసిన అయ్యప్పన్ ఆమెను మాయమాటలతో లోబరుచుకున్నాడు. ఆమెపై అత్యాచారానికి తెగబడుతూనే ఉన్నాడు. ఇటీవల ఆమె గర్భం దాల్చడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్‌కు ప్రయత్నించాడు. అనుమానించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగుచూసింది. విషయం పోలీసులకు చేరడంతో భయపడిన అయ్యప్పన్ పరారయ్యాడు. తనను బెదిరించి అత్యాచారానికి పాల్పడేవాడని బాధితురాలు పోలీసుల విచాణలో తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేశారు.
Go Back to Shorts
Tamil Nadu
Love
Rape

More Telugu News