నేనసలు ఇండస్ట్రీకి వచ్చిందే అందుకు: హీరో సప్తగిరి
Add ap7am to your home Screen

నేనసలు ఇండస్ట్రీకి వచ్చిందే అందుకు: హీరో సప్తగిరి

  • దర్శకుడిని కావాలని ఇండస్ట్రీకి వచ్చాను
  •  సన్నిహితులు నన్ను కమెడియన్ ను చేశారు
  •  హీరోగానే కాదు కమెడియన్ గా కూడా చేస్తూనే వుంటాను
తెలుగు తెరపై సందడి చేసే కమెడియన్స్ లో సప్తగిరి ఒకరు. ఒక వైపున కమెడియన్ గా చేస్తూనే, మరో వైపున హీరోగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఆయన తాజా చిత్రంగా రేపు 'వజ్రకవచధర గోవింద' ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. 'భారతీయుడు' సినిమా చూసిన తరువాత దర్శకుడిని కావాలనే బలమైన కోరిక నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది. నేను అందుకు సంబంధించిన ప్రయత్నాల్లో ఉండగా, 'నీ యాస .. బాడీ లాంగ్వేజ్ బాగున్నాయి' అంటూ నన్ను కమెడియన్ ను చేశారు. కమెడియన్ గా సంపాదించుకున్న క్రేజ్ నన్ను హీరోను చేసింది. అలాగని చెప్పి నేను కమెడియన్ గా చేయనని కాదు, ఒక వైపున హీరోగా చేస్తూనే మరో వైపున కమెడియన్ గా చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. నేను హీరోగా మాత్రమే చేస్తానంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు" అని చెప్పుకొచ్చాడు. 
saptagiri
vaibhavi joshi

More Telugu News