ఏపీ సీఎం జగన్ తో జనసేన ఎమ్మెల్యే రాపాక ప్రత్యేక భేటీ!
- సీఎం ఛాంబర్ లోకి వెళ్లి సమావేశమయిన నేత
- రాజకీయాలు మాట్లాడలేదని వ్యాఖ్య
- గతంలో వైసీపీలో చేరుతారని ఊహాగానాలు
అనంతరం బయటకి వచ్చిన వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ..‘ ముఖ్యమంత్రితో నేను మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యాను. రాజకీయ విషయాలేవీ చర్చించలేదు. రాజోలు నియోజక వర్గం అభివృద్ధిపై సీఎంతో మాట్లాడాను’ అని స్పష్టం చేశారు. గతంలో వరప్రసాద్ వైసీపీలో చేరతారని వార్తలు రాగా, వాటిని ఆయన కొట్టిపారేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున రాపాక వరప్రసాద్ ఒక్కరే గెలిచారు.