తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లోనే.. ప్రజా దర్బార్ నిర్వహించనున్న సీఎం జగన్!
- తాడేపల్లి క్యాంపు ఆఫీసులో ఏర్పాటు
- రోజుకు అరగంట పాటు ప్రజలతో భేటీ
- విధివిధానాలు రూపొందిస్తున్న అధికారులు
వైఎస్ తరహాలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో ప్రజలతో మమేకం కావాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందులో భాగంగా వచ్చే నెల మొదటివారం నుంచి రోజూ ఉదయం అరగంట చొప్పున ప్రజలను కలుసుకోవాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం తగిన విధివిధానాలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు వెల్లడించాయి. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని పేర్కొన్నాయి.