Odisha: ఒడిశాలో దారుణం.. పాత కక్షలతో తలను నరికి పట్టుకెళ్లిన దుండగులు!

షార్ట్స్‌లో చూడండి
ఒడిశాలోని సంబల్ పూర్ జిల్లాలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని బాలుపల్లి గ్రామంలో సత్యనారాయణ(40) అనే వ్యక్తి ఇంటి బయట నిద్రపోయాడు. అయితే గుర్తుతెలియని దుండగులు ఆయన తలను నరికేశారు. అనంతరం దాన్ని పట్టుకెళ్లారు.

ఉదయాన్నే ఈ దారుణాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేశారు. కాగా, పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పోలీస్ ఉన్నతాధికారులు ఏర్పాటుచేశారు.
Go Back to Shorts
Odisha
beheaded
Police

More Telugu News