ఆసీస్ లో ఆత్మవిశ్వాసం లోపించింది: సచిన్
- ఆసీస్ ఆటతీరు మరింత విస్మయం కలిగించింది
- వార్నర్ ఇలా ఆడడం ఎప్పుడూ చూడలేదు
- రోహిత్, హార్దిక్ ల క్యాచ్ లు వదిలి మూల్యం చెల్లించుకున్నారు
గతంలో ఎన్నడూలేనట్టుగా ఆసీస్ ఈ మ్యాచ్ లో ఆత్మవిశ్వాసం కోల్పోయి కనిపించిందని తెలిపారు. ముఖ్యంగా, డేవిడ్ వార్నర్ రన్ రేట్ చూస్తే ఆ విషయం స్పష్టమవుతుందని, గతంలో వార్నర్ ఎప్పుడు బ్యాటింగ్ చేసినా 100కి పైగా స్ట్రయిక్ రేట్ నమోదయ్యేదని, ఈ మ్యాచ్ లో అతడు తీసిన పరుగుల కంటే ఆడిన బంతులే ఎక్కువగా ఉన్నాయని వివరించారు. అంతకుముందు, రోహిత్ శర్మకు, హార్దిక్ పాండ్యకు లైఫ్ లు ఇవ్వడం ద్వారా ఆసీస్ భారీ మూల్యం చెల్లించుకుందని సచిన్ అభిప్రాయపడ్డారు.