ఏపీ మంత్రి పుష్ప శ్రీవాణి ఎస్టీ కానే కాదంటున్న అప్పలనర్స!
- కురుపాం నుంచి గెలిచిన పుష్ప శ్రీవాణి
- కులంపై కేసు నడుస్తూ ఉందన్న అప్పలనర్స
- ఎస్టీ కాని వారికి ఎస్టీ కోటాలో మంత్రి పదవిపై అభ్యంతరం
అరకులో మీడియాతో మాట్లాడిన ఆయన, పుష్ప శ్రీవాణి సోదరి రామతులసి ఎస్టీ కాదని గతంలో అధికారులు ధ్రువీకరించారని, ఈ నేపథ్యంలోనే ఆమె తన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారని గుర్తు చేశారు. సోదరి రామతులసి ఎస్టీ కానప్పుడు పుష్పశ్రీవాణి ఎస్టీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఆమె తొలిసారి గెలిచినప్పుడే కోర్టులో కేసు దాఖలైందని, అది ఇంకా విచారణలో ఉండగానే, రెండోసారి ఆమెకు టికెట్ ఇచ్చారని అప్పలనర్స అన్నారు. గెలిచిన ఆమెకు డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖలను ఎలా ఇస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు.