ఏపీ మంత్రివర్గ ప్రమాణానికి ముహూర్తం ఖరారు!
- రేపు ఉదయం 11.49 గంటలకు కార్యక్రమం
- సచివాలయం ప్రాంగణంలోనే కార్యక్రమం
- పూర్తిస్థాయిలో ఏర్పాటుకానున్న మంత్రివర్గం
కాగా, నేడు వైకాపా శాసనసభాపక్ష సమావేశం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్, పార్టీలో తీసుకురావాల్సిన మార్పులు, మంత్రివర్గం కూర్పుపై స్పష్టత ఇవ్వనున్నారు. ఎవరెవరికి ఏ కారణంతో మంత్రి పదవులు ఇవ్వాల్సి వచ్చిందన్న విషయంలోనూ నేతలకు జగన్ వివరిస్తారని తెలుస్తోంది.