'వజ్రకవచధర గోవింద' నుంచి ట్రైలర్ రిలీజ్
Add ap7am to your home Screen

'వజ్రకవచధర గోవింద' నుంచి ట్రైలర్ రిలీజ్

  • సప్తగిరి హీరోగా మరో సినిమా
  • కామెడీ ప్రధానంగా సాగే కథ
  • ఈ నెల 14వ తేదీన విడుదల  
సప్తగిరి తాజా చిత్రంగా 'వజ్రకవచధర గోవిందా' రూపొందింది. అరుణ్ పవార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కామెడీ .. యాక్షన్ .. ఎమోషన్ .. సస్పెన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఓ దేవాలయం .. వజ్రాల తవ్వకం చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది. 'జనం భయంలో దెయ్యాన్నీ .. పూనకంలో దేవుణ్ణి చూస్తారు' .. 'ఇదే లాస్ట్ సిగరెట్ .. ఇదే లాస్ట్ పెగ్గు అనే మగాడి మాట, ఇదే లాస్ట్ షాపింగ్ అనే ఆడవాళ్ల మాట జనాలు నమ్మినట్టుగా చరిత్రలో లేదు' వంటి డైలాగ్స్ బాగున్నాయి. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
saptagiri

More Telugu News