Andhra Pradesh: అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రజలకు చేరువ కావాలని కోరుకుంటున్నా!: చంద్రబాబు నాయుడు

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రజలకు చేరువకావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఈరోజు ట్విట్టర్ లో చంద్రబాబు స్పందిస్తూ..‘తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పిస్తూ, వారి ఆకాంక్షలు ఫలించేలా అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రజలకు చేరువకావాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Twitter

More Telugu News