సీఎం జగన్ కీలక నిర్ణయం.. మసీదులు, ఈద్గాల కోసం రూ.5 కోట్లు విడుదల!
- రంజాన్ పండుగ సందర్భంగా నిర్ణయం
- మరమ్మతులు, రంగులు వేయడం కోసం నిధులు
- ఇఫ్తార్ విందులకు వాడుకునేందుకూ వెసులుబాటు
ఈ నిధులతో జిల్లాల్లో ఇఫ్తార్ విందులు కూడా నిర్వహించుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ రోజు ఏపీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీకి వస్తున్న ఆదాయం, ఖర్చులు, పెండింగ్ బిల్లులు సహా పలు అంశాలపై జగన్ ఈ సందర్భంగా చర్చించారు.