జగన్ మా విద్యార్థే.. ఇక్కడే బీకామ్ చదువుకున్నాడు!: ప్రగతి మహా విద్యాలయ
- 1991-94లో జగన్ బీకామ్ పూర్తి
- లైబ్రరీలో ఎక్కువసేపు జగన్ గడిపేవారు
- కాలేజీ ప్రిన్సిపల్ వై.కృష్ణమోహన్ నాయుడు వెల్లడి
కాలేజీ యాజమాన్యం విద్యార్థులు, అధ్యాపకులకు మిఠాయిలు పంచింది. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ వై.కృష్ణమోహన్ నాయుడు మాట్లాడుతూ.. జగన్ ఎక్కువగా లైబ్రరీలో గడిపేవారని తెలిపారు. ఆయన బీకామ్ లో మంచిమార్కులతో పాసయ్యారనీ, అప్పట్లో ప్రిన్సిపల్ గా ప్రొ.వేదాచలం ఉండేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన క్రమశిక్షణతో 1991 బ్యాచ్ లో చాలామంది విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు జగన్ ఏపీ ముఖ్యమంత్రి కానుండటం నిజంగా తమకు గర్వంగా ఉందన్నారు.