Telugudesam: ఓటమి అనంతరం బైక్ పై ఇంటింటికీ తిరిగి థ్యాంక్స్ చెప్పిన టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్

షార్ట్స్‌లో చూడండి
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన మంత్రులు సైతం దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు. అలాంటివారిలో పెనమలూరు నుంచి పోటీచేసిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కూడా ఉన్నారు. అయితే, ప్రసాద్ తన ఓటమి అనంతరం కుంగిపోకుండా ధైర్యంగా ప్రజల మధ్యకు వచ్చారు. రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్ పై ఒక్కడే పెనమలూరు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించారు. బైక్ మీద వెళుతూ ప్రతి ఇంటిముందు ఆగి అక్కడి వ్యక్తులకు థ్యాంక్స్ చెప్పారు. "ఓటు వేసిన వాళ్లకు థ్యాంక్స్, నేనైతే ఏ తప్పు చేయలేదమ్మా. ఒకవేళ ఏమైనా తప్పు చేసుంటే మాత్రం క్షమించండి" అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ముందుకు సాగిపోయారు.

Go Back to Shorts
Telugudesam

More Telugu News