కాంగ్రెస్ కి మరో విజయం .. రేవంత్ రెడ్డి గెలుపు

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మరో ఎంపీ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే భువనగిరి, నల్గొండ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, తాజాగా 3వ స్థానాన్ని దక్కించుకుంది. మల్కాజ్ గిరి లోక్ సభ స్థానంలో రేవంత్ రెడ్డి విజయాన్ని సాధించారు.

టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ పై 6,270 ఓట్ల మెజారిటీతో ఆయన జయకేతనం ఎగురవేశారు. ఈ ఉదయం నుంచి కూడా ఇటు టీఆర్ఎస్ అభ్యర్థి .. అటు కాంగ్రెస్ అభ్యర్థి ఒక్కో రౌండ్ లో ఒకరు ఆధిక్యంలో ఉంటూ వచ్చారు. దాంతో ఎవరిని విజయం వరిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. చివరికి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని విజయం వరించడంతో, ఆయన అభిమాన గణం తేలికగా ఊపిరి పీల్చుకుంది.
Go Back to Shorts
revanth reddy

More Telugu News