మరోసారి హైకోర్టును ఆశ్రయించిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్!
- ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్
- విచారణకు స్వీకరించిన ధర్మాసనం
- సైబర్ క్రైమ్ పోలీసులకు టీవీ9 యాజమాన్యం ఫిర్యాదు
దీంతో ఐపీసీ, సీఆర్పీసీ, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన పోలీసులు, రవిప్రకాశ్, నటుడు శొంఠినేని శివాజీలకు నోటీసులు జారీచేశారు. అయితే మూడుసార్లు నోటీసులు అందుకున్నప్పటికీ వీరిద్దరూ విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ దేశం విడిచిపెట్టి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీచేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు నేడు విచారించనుంది.