ఇకపై అలాంటి పాత్రలు చేయను: హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్
- తమిళంలో వరుస సినిమాలు
- త్వరలో తెలుగు తెరకి పరిచయం
- మొహమాటాలకు వెళ్లనంటున్న ఐశ్వర్య రాజేశ్
తాజా ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేశ్ మాట్లాడుతూ, ఇంతకుముందు అంతగా ప్రాధాన్యత లేని పాత్రలను కొన్ని మొహమాటాల కారణంగా చేయవలసి వచ్చింది. అలాంటి పాత్రల వలన నాకు ఎంతమాత్రం గుర్తింపు రాలేదు. ఆ తరహా పాత్రల్లో ఒకటి 'సామీ స్క్వేర్' లో చేశాను. ఆ సినిమాలో రెండో కథానాయికగా ఎంత మాత్రం ప్రాధాన్యత లేని పాత్ర చేసినందుకు ఇప్పటికీ బాధపడుతుంటాను. ఇకపై ఎలాంటి మొహమాటాలకు వెళ్లదలచుకోలేదు .. అలాంటి పాత్రలను చేయదలచుకోలేదు" అని చెప్పుకొచ్చింది.