కాలేజ్ లో మొదటిరోజు భలే గమ్మత్తు జరిగింది: నటుడు 'రెడీ' భరత్
Add ap7am to your home Screen

కాలేజ్ లో మొదటిరోజు భలే గమ్మత్తు జరిగింది: నటుడు 'రెడీ' భరత్

  • మొదటి రోజున కాలేజ్ కి వెళ్లాను
  • అంతా నన్ను చూడటానికి వచ్చారు
  •  ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు  
బాలనటుడిగా భరత్ అనేక చిత్రాల్లో నటించాడు. 'రెడీ' చిట్టినాయుడు అంటే చాలు ఆయన అందరికీ గుర్తుకు వచ్చేస్తాడు. ఆ సినిమాలో 'చిట్టినాయుడు' పాత్రలో ఆయన అంతగా అలరించాడు. ఆయన తాజా చిత్రంగా 'ఏబీసీడీ' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చాడు.

 "నేను కాలేజ్ ఏజ్ కి వచ్చేసరికి బాగా సన్నబడ్డాను. మొదటి రోజున కాలేజ్ కి వెళ్లాను. లంచ్ టైమ్ లో మా క్లాస్ ముందు మిగతా స్టూడెంట్స్ గుమిగూడారు. వాళ్లని తప్పించుకుని లంచ్ కి వెళ్లాను. తిరిగి క్లాస్ కి వెళ్లేటప్పుడు అదే పరిస్థితి. అందరినీ తప్పించుకుని క్లాస్ లోకి వచ్చాను. కాలేజ్ వదిలాక వెళ్లి బస్సులో కూర్చున్నాను. అప్పుడు ఒక స్టూడెంట్ నాతో ' మీ క్లాస్ లో ఎవరో సినిమా ఆర్టిస్ట్ వున్నాడట గదా, చూద్దామనుకుంటే ఈ రోజు రాలేదు. రేపు వస్తే మాత్రం నాకు చెప్పు' అన్నాడు. అప్పుడు అర్థమైంది .. వాళ్లంతా నన్ను చూడటానికి వచ్చారనీ, నేను సన్నబడటం వలన గుర్తుపట్టలేదని" అంటూ నవ్వేశాడు.
bharath

More Telugu News