చూడండి, శివరాజ్ సింగ్ ఎన్ని అబద్ధాలు చెబుతున్నారో!: రుణమాఫీ పత్రాలను చూపించిన రాహుల్
- రైతు రుణమాఫీపై కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందన్న శివరాజ్ సింగ్
- పన్ను చెల్లించే తన సోదరుడికి అది వర్తించదన్న మాజీ సీఎం
- చౌహాన్ పెద్ద అబద్ధాలకోరన్న రాహుల్
అయితే, కమల్‌నాథ్ వ్యాఖ్యలను శివరాజ్ సింగ్ చౌహాన్ కొట్టిపడేశారు. ఈ విషయమై తాను వాకబు చేశానని, తన సోదరుడు రోహిత్ రైతు రుణమాఫీకి దరఖాస్తు చేసుకోలేదని తెలిసిందని చౌహాన్ పేర్కొన్నారు. ఆయన పన్నులు కూడా కడుతుంటారని గుర్తు చేశారు. ఆయనకు రుణమాఫీ ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. చౌహాన్ వ్యాఖ్యలపై రాహుల్ స్పందించారు. శివరాజ్ పెద్ద అబద్ధాలకోరని అన్నారు. ఆయన బంధువులకు కూడా రైతు రుణమాఫీ అయిందని చెప్పడానికి ఇదే నిదర్శనమంటూ రుణమాఫీ పత్రాలను అందరికీ చూపించారు.