పెద్దలకు తెలియకుండా పెళ్లి.. ఆర్థిక ఇబ్బందులకు తాళలేక నెలల్లోనే ఆత్మహత్య
- పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్టిన జంట
- ఉసురు తీసిన ఆర్థిక ఇబ్బందులు
- పెళ్లి చేసుకుని ఏడాది కూడా తిరక్కుండానే ఉసురు తీసుకున్న జంట
దీంతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని ధవళేశ్వరం కొత్తపేటలో కాపురం పెట్టారు. పెళ్లి తరువాత జగదీశ్ స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పనికి కుదిరాడు. రెండు నెలలు చేసి మానేశాడు. ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఆరు నెలలు అప్పులతో నెట్టుకొచ్చారు. అయితే, అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు రావడంతో తట్టుకోలేక జగదీశ్-దీప్తిలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.