రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బ తినడానికి వైసీపీయే కారణం: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు
- వైసీపీ వ్యాఖ్యలు అర్థ రహితం
- మోదీ పైసా ఇవ్వకున్నా నిలదీయలేదు
- కులాల ప్రస్తావన మంచిది కాదు
ప్రధాని మోదీ రాష్ట్రానికి నయా పైసా ఇవ్వకపోయినా వైసీపీ ఏనాడూ ఆ పార్టీని నిలదీయలేదని విమర్శించారు. ఆర్థిక అంశాలపై కనీస అవగాహన లేకుండా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడటం దారుణమన్నారు. విజయసాయిరెడ్డి ఓ బాధ్యత కలిగిన పదవిలో ఉంటూ కులాల ప్రస్తావన తీసుకురావడం మంచి పరిణామం కాదన్నారు. కేంద్రం సహకరించకపోవడం వల్లే ఏపీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని అశోక్ బాబు విమర్శించారు.