మోదీ.. పేదలకు కాదు అనిల్ అంబానీకి చౌకీదార్: రాహుల్ గాంధీ
- ఆదివాసీల కోసం మోదీ చేసిందేమీ లేదు
- మేము అధికారంలోకి వస్తే ‘న్యాయ్’ పథకం తీసుకొస్తాం
- ఆదివాసీలు, పేదల జీవితాల్లో మార్పు తెస్తాం
అన్ని వర్గాలను మోదీ మోసం చేశారని, లక్షల కోట్ల రూపాయల డబ్బును పేదలు, రైతులు, ఆదివాసీల నుంచి మోదీ తీసుకున్నారని, ఆ డబ్బును అనిల్ అంబానీ, నీరవ్ మోదీ, మోహుల్ చోక్సీ, విజయ్ మాల్యాకు ఇచ్చారని ఆరోపించారు. ఆదివాసీల భూములు, అడవులను అంబానీకి మోదీ ఇచ్చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీలకు ఇష్టం లేకుండా వారి భూములను ఏ ప్రభుత్వం కూడా సేకరించకూడదన్న చట్టాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన విషయాన్ని రాహుల్ గుర్తుచేశారు. గడచిన ఐదేళ్లలో రైతులకు, ఆదివాసీలకు, యువతకు మోదీ తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు.