యాత్రకు వచ్చి వెళ్తుండగా ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి దుర్మరణం
- విహార యాత్రకు తమిళనాడు వచ్చిన మహారాష్ట్ర వాసులు
- కంటెయినర్‌ను ఢీకొన్న కారు
- మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు
ఈ ఘటనలో కారులోని ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.