రాజశేఖర్, జీవిత ఎన్నోసార్లు ఫోన్ చేసి సపోర్ట్ అడిగారు, శివాజీరాజా కలుద్దామని చెప్పి కూడా కలవలేదు: నాగబాబు
Add ap7am to your home Screen

రాజశేఖర్, జీవిత ఎన్నోసార్లు ఫోన్ చేసి సపోర్ట్ అడిగారు, శివాజీరాజా కలుద్దామని చెప్పి కూడా కలవలేదు: నాగబాబు

  • రిటర్న్ గిఫ్ట్ పై ఎట్టకేలకు స్పందించిన మెగాబ్రదర్
  • కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలనే నరేష్ కు మద్దతిచ్చాను
  • వ్యక్తిగతంగా ఎవరిమీదా వ్యతిరేకత లేదు
నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన మెగాబ్రదర్ నాగబాబు తనపై శివాజీరాజా చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చారు. తాను ఎంపీ స్థాయిలో పోటీ చేస్తున్నాను కాబట్టి, ఆ స్థాయికి తగిన విమర్శలకు మాత్రమే స్పందించాలని మొదట భావించానని, అయితే ప్రతి ఒక్కరూ దీని గురించి అడుగుతుండడంతో స్పందించక తప్పడంలేదని నాగబాబు తెలిపారు.

కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే నరేష్ ప్యానల్ కు సపోర్ట్ చేశానని, వాస్తవానికి తనకు నరేష్ తో కంటే శివాజీరాజాతోనే అనుబంధం ఎక్కువ అని తెలిపారు.

తనకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదని స్పష్టం చేశారు. కానీ, రాజశేఖర్, జీవిత అనేక పర్యాయాలు ఫోన్ చేసి సపోర్ట్ చేయాలంటూ అభ్యర్థించారని, అదే సమయంలో శివాజీరాజా కలుద్దామని చెప్పి కూడా కలవలేదని వెల్లడించారు. శివాజీరాజా ఓ పర్యాయం 'మా' అధ్యక్షుడిగా పనిచేశాడని, ఓసారి కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలని భావించడంలో తప్పులేదని అన్నారు.
Nagababu

More Telugu News