కొలంబోలోని ఓ థియేటర్‌ వద్ద పేలిన మరో బాంబు

ఉగ్రదాడిలో రక్తమోడిన శ్రీలంక రాజధాని కొలంబోలో మరో బాంబు పేలింది. బుధవారం ఉదయం ఓ సినిమా థియేటర్‌ వద్ద దుండగులు మోటారు బైక్‌లో పెట్టిన బాంబు పేలింది. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈస్టర్‌ పర్వదినం సందర్భంగా ఈనెల 21వ తేదీ ఆదివారం కొలంబోలో వరుస పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్లలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 359 కాగా, ఇందులో 38 మంది విదేశీయులు ఉన్నారు.

 దీంతో అప్రమత్తమైన శ్రీలంక భద్రతా యంత్రాంగం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నా ఇంకా అక్కడక్కడా బాంబులు పేలుతూనే ఉన్నాయి. దీంతో కొలంబో వాసులు వణికిపోతున్నారు. మరిన్ని దాడులు చేసేందుకు ముష్కరులు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రవాదులు ఇంకా ఎక్కడైనా బాంబులు పెట్టారా అన్న దానిపై పోలీసులు విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. ఇప్పటికే అనుమానితులు 58 మందిని అరెస్టు చేశారు. వివరాలు రాబడుతున్నారు.
Go Back to Shorts
Sri Lanka
colombo
another blast

More Telugu News