359కి చేరిన శ్రీలంక మృతుల సంఖ్య.. మరో 18 మంది అరెస్ట్
- ప్రాణాలు కోల్పోయిన వారిలో 38 మంది విదేశీయులు
- మృతుల్లో 10 మంది భారతీయులు
- మరిన్ని దాడులు జరగనున్నాయనే భయంలో సింహళీలు
మరోవైపు, మరిన్ని పేలుళ్లకు ముష్కరులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే వార్తలు శ్రీలంకను వణికిస్తున్నాయి. మరోవైపు, పేలుళ్లకు పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్న రాత్రి కూడా మరో 18 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో, ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేసిన వారి సంఖ్య 58 కి చేరుకుంది.