సీఎం సమీక్షలు నిర్వహిస్తే తప్పేంటి?: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
- సమీక్షలపై ఆంక్షలు పెట్టడమేంటి?
- రీ పోలింగ్ నిర్వహించాలని కోరుతాం
- ఓట్ల లెక్కింపును నిలిపివేయాలి
రీ పోలింగ్ విషయమై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసేందుకు కూడా వెనుకాడమన్నారు. ఎన్నికల్లో డబ్బు పట్టుబడిన నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని ఈసీని కోరుతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న నీటి ఎద్దడి విషయమై చర్య తీసుకోవాలని, ఈ నెల 25న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయనున్నట్టు రామకృష్ణ తెలిపారు.