జైల్లో తనను దారుణంగా కొట్టారంటూ కన్నీరు పెట్టుకున్న బీజేపీ నేత సాధ్వి ప్రజ్ఞాసింగ్
- మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రజ్ఞపై ఆరోపణలు
- 13 రోజులపాటు పోలీసు కస్టడీ
- ఆ సమయంలో తనను చిత్రహింసలకు గురిచేశారన్న సాధ్వి
తాను జైలులో ఉన్నన్ని రోజులు సిబ్బంది తనకు నరకం చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద కొరడాతో తనను చావబాదారని, విచక్షణ రహితంగా చిత్రహింసలు పెట్టారని పేర్కొన్నారు. తనపై కనీస జాలి కూడా చూపకుండా హింసించారని పేర్కొంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా జైల్లో ఉన్న 13 రోజులు కొడుతూనే ఉన్నారని పేర్కొన్నారు. మాలేగావ్ పేలుళ్లు తన పనేనని తన నోటితో చెప్పించాలనే ఉద్దేశంతోనే పోలీసులు చిత్ర హింసలకు గురిచేశారని ప్రజ్ఞ ఆరోపించారు. కాగా, 2008లో మాలేగావ్‌లోని ఓ మసీదు వద్ద జరిగిన పేలుళ్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, వందమందికిపైగా గాయపడ్డారు.