పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. దగ్గరైతే రేప్ కిందే లెక్క: సుప్రీంకోర్టు కీలక తీర్పు
- పెళ్లి పేరిట నమ్మించి సహజీవనం
- పదేళ్ల శిక్షను ఖరారు చేసిన హైకోర్టు
- ఏడేళ్లకు తగ్గిస్తూ, సుప్రీంకోర్టు చివాట్లు
దీంతో జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ ఎమ్‌ఆర్ షాలతో కూడిన ధర్మాసనం కేసును విచారించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు కాబట్టి, శారీరక కలయికకు ఆమె సమ్మతిని సాధారణ అనుమతిగా పరిగణించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. లైంగికంగా కలిసేందుకు ఆమె అంగీకరించినా అది అత్యాచారమేనని, హత్య కన్నా రేప్ అత్యంత దారుణమైనదని చివాట్లు పెట్టింది, నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.