ambati: కోడెలపై దాడి ఘటన.. అంబటి రాంబాబుపై కేసు నమోదు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ టీడీపీ నేత కోడెల శివప్రసాద్ పై నిన్న వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ దాడి ఘటన నేపథ్యంలో వైసీపీ నేత అంబటి రాంబాబుతో పాటు 60 మందిపై కేసు నమోదు చేశారు. హత్యాయత్నంతో పాటు మరో 10 సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేశారు. ఈ దాడికి అంబటి రాంబాబు కుట్ర పన్నారని ఆరోపిస్తూ వారిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేస్తామని సత్తెనపల్లి డీఎస్పీ పేర్కొన్నట్లు సమాచారం.

కాగా, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొంత సమాచారం పోలీసులు సేకరించారు. కోడెలపై దాడి జరిగిన సమయంలో పోలింగ్ బూత్ లో ఉన్న అధికారుల నుంచి, స్థానికుల నుంచి పోలీసులు సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. వీడియో ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.
Go Back to Shorts
ambati
kodela
Telugudesam
YSRCP
sattenapali

More Telugu News